2026 సినిమా ప్రేమికులకు ఒక బ్లాక్‌బస్టర్ సంవత్సరంగా నిలవనుంది. ఎందుకంటే టాప్ హీరోల సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. ఇందులో ప్రభాస్, విజయ్, రణబీర్ కపూర్, యాష్ వంటి స్టార్ హీరోల సినిమాలున్నాయి.
()మొదటగా ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్నం ది రాజా సాబ్. రిలీజ్ డేట్: జనవరి 9, 2026. సౌత్ సూపర్‌స్టార్ ప్రభాస్, నిధి అగర్వాల్ ప్రధాన పాత్రల్లో హారర్ కామెడీ సినిమా. దర్శకుడు మారుతి దాసరి.
()అలాగే ఇళయ దళపతి విజయ్ రాజకీయాల్లోకి వెళ్ళే ముందు చేస్తున్న చివరి సినిమా జన నాయగన్ . దర్శకుడు హెచ్. వినోత్, హీరోయిన్ పూజా హెగ్డే. పొంగల్ రోజున థియేటర్లలో రిలీజ్ అవుతుంది. రిలీజ్ డేట్: జనవరి 9, 2026
()బోలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ విషాల్ భరద్వాజ్ దర్శకత్వంలోని రొమాంటిక్ డ్రామా ఓ రొమియో. 12 సంవత్సరాల తర్వాత షాహిద్-విషాల్ కలయికలో వస్తుండగా ప్రధాన పాత్రల్లో త్రిప్తి డిమ్రి, రాండీప్ హుడా, డిషా పటానీ, నానా పటేకర్ నటిస్తున్నారు. రిలీజ్ డేట్: వాలెంటైన్స్ డే 2026
()1997 క్లాసిక్ సీక్వెల్ బార్డర్ 2. అనురాగ్ సింగ్ దర్శకత్వం వహిస్తుండగా యాన్సెంబుల్ కాస్ట్‌లో వరుణ్ ధావన్, సన్నీ డియోల్, ఆహాన్ షెట్టి, దిల్జిట్ దోసంజ్. దేశభక్తి పూర్ణ సినిమా.రిలీజ్ డేట్: జనవరి 23, 2026
()అదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ధురంధర్ పార్ట్ 2. మొదటి పార్ట్ విజయవంతం కావడంతో రెండవ పార్ట్, రణవీర్ సింగ్ పాత్ర హంసా అలీ జీవితాన్ని వివరించనుంది. రిలీజ్ డేట్: మార్చ్ 19, 2026
Also Read:తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి శోభ
()కన్నడ సూపర్‌స్టార్ యాష్ ప్రధాన పాత్రలో, గీతు మోహన్దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం టాక్సిక్. కీలక పాత్రల్లో కియారా అద్వానీ (నాడియా), హుమా ఖురెషి (ఎలిజబెత్). ధురంధర్ పార్ట్ 2 తో బాక్స్ ఆఫీస్ క్లాష్.రిలీజ్ డేట్: మార్చ్ 19, 2026
()రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో మిథాలాజికల్ ఎపిక్ సినిమా రామాయణం పార్ట్ 1. దర్శకుడు నితేష్ తివారీ. రణబీర్ కపూర్ – రాముడు, యాష్ – రావణ, సాయి పల్లవి – సీత. రెండు పార్ట్‌లలో రిలీజ్ అవుతుంది, మొదటి పార్ట్ దీపావళి 2026న. రిలీజ్ డేట్: దీపావళి 2026

