2025:భారత క్రికెట్‌లో విషాదం-వివాదాలు!

10
- Advertisement -

2025లో భారత క్రికెట్‌లో కొన్ని మర్చిపోలేని అనుభూతిని మిగిలిస్తే మరికొన్ని చేధు అనుభవాలు మిగిల్చాయి. ప్రధానంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట ఈ ఏడాది జరిగిన విషాధాల్లో ఒకటి. ఐపీఎల్ విజేతగా తొలిసారి నిలిచింది ఆర్సీబీ. ఈ నేపథ్యంలో చిన్నస్వామి స్టేడియంలో విక్టరీ పరేడ్ నిర్వహించగా ఉహించని విధంగా అభిమానులు తరలివచ్చారు.

దీంతో జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తర్వాత M.చిన్నస్వామి స్టేడియం మహిళల ODI వరల్డ్ కప్ 2025 మరియు విజయ హజారే ట్రోఫీ 2025/26 వంటి పెద్ద ఈవెంట్లను ఆతిథ్యం ఇవ్వలేకపోయింది. ఐపీఎల్ మ్యాచ్‌లకు మాత్రమే భద్రతా నిబంధనలు కట్టుబడి అనుమతి ఇవ్వబడింది.

2025 ఆసియా కప్‌లో భారత మరియు పాకిస్తాన్ జట్ల మధ్య నో-హ్యాండ్షేక్ సంఘటన మరో పెద్ద వివాదం. ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ ‘మెన్ ఇన్ బ్లూ’ విజయం సాధించినప్పటికీ, జట్లు ఏకంగా హ్యాండ్షేక్ చేయలేదు. పాకిస్తాన్ మ్యాచ్ రిఫరీ అండి పైక్రాఫ్ట్పై ఫిర్యాదు చేస్తూ, అవగాహన లేకపోతే అఫ్గనిస్తాన్‌తో కీలక మ్యాచ్‌కు నిలిచిపోవాలని హెచ్చరించింది.

నో-హ్యాండ్షేక్ వివాదం తరువాత ఈ ట్రోఫీ వివాదం సంచలనం సృష్టించింది. భారత జట్టు పాకిస్తాన్‌ను అన్ని మూడు మ్యాచ్‌ల్లో, ఫైనల్‌లో కూడా ఓడించింది. కానీ, ACC చీఫ్ మోహ్సిన్ నక్వీ నుండి ట్రోఫీ స్వీకరించడంలో భారత జట్టు నిరాకరించింది. నక్వీ ట్రోఫీని డుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నుండి తీసుకెళ్లారు. ఇప్పటివరకు భారత్ తమ ట్రోఫీ పొందలేదు.

Also Read:తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి శోభ

- Advertisement -