2025 సంవత్సరం ఎంతోమంది సెలబ్రెటీలకు మరపురాని జ్ఞాపకంగా మిగలగా మరికొంతమందికి చేధు అనుభవాన్ని మిగిల్చింది.
()‘లస్ట్ స్టోరీస్ 2’ సినిమాలో కలిసి నటించిన నటులు తమన్నా భాటియా, విజయ్ వర్మ రెండేళ్లుగా కొనసాగిన తమ ప్రేమ సంబంధానికి ముగింపు పలికారు. ఈ వార్త అభిమానులను నిరాశకు గురి చేసింది.
()సినీ దర్శకుడు పలాష్ ముచ్హాల్, భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన నవంబర్ 23, 2025న వివాహం చేసుకోవాల్సి ఉంది. అయితే స్మృతి తండ్రి ఆరోగ్య కారణాల వల్ల పెళ్లి వాయిదా పడింది. అనంతరం డిసెంబర్ 7, 2025న స్మృతి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వివాహం రద్దయిందని ప్రకటించారు.
()‘మిషన్: ఇంపాజిబుల్’ స్టార్ టామ్ క్రూయిజ్, క్యూబన్ మూలాల నటి ఆనా డి ఆర్మాస్ తమ సంబంధాన్ని ముగించుకున్నట్లు సమాచారం. 2025 జూలైలో అమెరికాలోని వెర్మాంట్‌లో కలిసి కనిపించడంతో వీరి మధ్య డేటింగ్ వార్తలు మొదలయ్యాయి.
()టెలివిజన్ నటులు కుషాల్ టాండన్, శివాంగి జోషి కూడా 2025లో విడిపోయారు. ఈ విషయాన్ని కుషాల్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ‘బర్సాతేన్ – మౌసమ్ ప్యార్ కా’ సీరియల్ షూటింగ్ సమయంలో వీరి మధ్య ప్రేమ మొదలైంది.
()‘యే రిష్తా క్యా కేహ్లాతా హై’ సీరియల్‌లో రాజశ్రీ మహేశ్వరి పాత్రతో ప్రసిద్ధి చెందిన లతా సభర్వాల్, తన భర్త నటుడు సంజీవ్ సేత్‌తో 15 ఏళ్ల వివాహ జీవితం తర్వాత 2025 జూన్‌లో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు.
Also Read:తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి శోభ

