ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 74,477. స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 28,294 మంది కాగా నిన్న స్వామివారి హుండీ ఆదాయం 2.84 కోట్లు వచ్చింది. సర్వదర్శనానికి *09* కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. SSD టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 03 గంటల సమయం పడుతోంది.
అలాగే తిరుమల శ్రీవారి దర్శనార్థం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖల పునరుద్ధరణకు మాత్రమే తాత్కాలికంగా టిటిడి నిర్ణయం తీసుకుంది.
ఈ నెల 15వ తేదీ నుండి సదరు నేతల సిఫార్సు లేఖలను మాత్రమే టిటిడి అనుమతించనుంది. అయితే మిగిలిన వారి సిఫార్సు లేఖల పై అంతకు ముందు తీసుకున్న నిర్ణయం కొనసాగుతుంది . నియమావళి ప్రకారం అనుమతి పొందిన భక్తులకు ఈ నెల 16వ తేదీ నుండి శ్రీవారి దర్శనం కల్పించనున్నారు.
Also Read:TTD:అన్నమయ్య సామాజిక కవి

