Lookback 2024: ఈ ఏడాది దేశంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలివే

8
- Advertisement -

2024 ముగింపు దశకు వచ్చేసింది. ఈ ఏడాది దేశంలో ఎన్ని చారిత్రాత్మక సంఘటనలు, వివాహాలు, ప్రభుత్వాల ఏర్పాటు, కుంభకోణాలు జరిగాయి. వాటి వివరాలను ఓసారి పరిశీలిస్తే…ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, చారిత్రాత్మకంగా మూడవసారి అధికారంలోకి వచ్చారు. ఇక అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ సైతం పదేళ్ల తర్వాత ప్రతిపక్ష హోదాను దక్కించుకోగా రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో 99 సీట్లు గెలుచుకుంది. మొత్తంగా ఇండియా కూటమి 234 స్థానాలను కైవసం చేసుకుంది.

కర్ణాటకలో సెక్స్ టేపుల కుంభకోణంలో సస్పెన్షన్‌కు గురైన జేడీ(ఎస్) నేత ప్రజ్వల్ రేవణ్ణ వివాదానికి కేంద్ర బిందువుగా మారారు. ఈ మొత్తం వ్యవహారం నేపథ్యంలో జరిగిన ఎన్నికల్లో జేడీఎస్‌కు పెద్ద షాక్ తగిలింది. ఫిబ్రవరిలో ఫేస్‌బుక్ లైవ్ సందర్భంగా ముంబైలోని ఐసీ కాలనీలో శివసేన మాజీ యూబీటీ కార్పొరేటర్ అభిషేక్ ఘోసల్కర్‌ను మారిస్ నొరోన్హా కాల్చి చంపారు. ఘోషాల్కర్‌పై కాల్పులు జరిపిన వ్యక్తి మోరిస్ తర్వాత తనను తాను కాల్చుకున్నాడు.

బిలియనీర్ పారిశ్రామికవేత్త మరియు అదానీ గ్రూప్ ఛైర్మన్ అయిన గౌతమ్ అదానీ పై అవినీతి ఆరోపణలు సంచలనం రేపాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ మరియు రాధికా మర్చంట్ వివాహం 2024 ముఖ్యాంశాలలో ఒకటి. ముంబైలో జరిగిన ఈ విలాసవంతమైన పెళ్లి వేడుకకు ప్రపంచదేశాల ప్రముఖులు హాజరయ్యారు.

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను బెదిరించి, పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలా హత్యకు సూత్రధారిగా పేరుగాంచిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ మళ్లీ వార్తల్లో నిలిచాడు. 2014 నుండి గుజరాత్‌లోని సబర్మతి జైలులో ఖైదు చేయబడినప్పటికీ, అక్టోబర్ 12న ముంబైలో జరిగిన ఎన్‌సిపి నాయకుడు బాబా సిద్ధిక్ హత్య తర్వాత ఒక్కసారిగా పోలీసులు ఉలిక్కిపడ్డారు.

భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి, DY చంద్రచూడ్, 2024లోకీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్టికల్ 370 రద్దు, సహజ లైంగిక చర్యలు,ఎన్నికల బాండ్ల చట్టబద్ధత, బుల్డోచర్యలపై కీలక నిర్ణయాలను తీసుకున్నారు.

Also Read:Google Top Trends:గూగుల్ టాప్ ట్రెండ్స్ ఇవే

- Advertisement -