Review 2023:వివాదాలకు కేరాఫ్‌ సినీ పరిశ్రమ

43
- Advertisement -

2023 వివాదాలకు కేరాఫ్‌గా నిలిచింది సినీ పరిశ్రమ. పుష్ప: ది రైజ్ చిత్రంలో స‌హాయ‌క పాత్ర‌తో పాపుల‌రైన జగదీష్ ప్రతాప్ బండారి, బ్లాక్ మెయిల్ చేసి తన ప్రియురాలి ఆత్మహత్యకు కారణమయ్యాడని ఆరోప‌ణ‌ల‌పై అరెస్టు అయ్యారు. జగదీష్ అరెస్ట్‌తో పుష్ప 2 షూటింగ్ షెడ్యూల్‌కు అంతరాయం కలిగింది.

డీప్ ఫేక్ వీడియో యావత్ భారతాన్నే షేక్ చేసింది. రష్మికా,కత్రినాతో పాటు పలువురు నటులు ఈ డీప్‌ఫేక్‌ సంచలనం సృష్టించింది. టెక్నాలజీని దుర్వినియోగం చేయడంపై అంతా ఆవేదన వ్యక్తం చేశారు. త్రిష కృష్ణన్ పై మన్సూర్ అలీ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు సంచ‌ల‌నం అయ్యాయి. జాతీయ మహిళా కమిషన్‌ ఫిర్యాదు మేరకు చెన్నై పోలీసులు అతడిని అరెస్టు చేశారు.

సమంత రూత్ ప్రభుపై నిర్మాత చిట్టిబాబు వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. స్టార్ హీరోయిన్‌గా ఆమె కెరీర్ ముగిసిందంటూ వ్యాఖ్యానించగా సమంత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. నటి విచిత్ర తన బిగ్ బాస్ 7 తమిళ సంభాషణలో తెలుగు సినిమా సెట్‌లో అనుచిత ప్రవర్తనను వివరిస్తూ ఒక బాధాకరమైన అనుభవాన్ని షేర్ చేసారు. బెదిరింపులను, అసౌకర్య పరిస్థితులను ఎదుర్కొన్నాన‌ని, అనుచితమైన స్పర్శ ఎదురైంద‌ని తెలిపింది.

Also Read:24న బీఆర్ఎస్ ‘స్వేద పత్రం’

- Advertisement -