ఓటీటీ : ఈ వారం కంటెంట్ ఇదే

35
- Advertisement -

ఈ వారంలో కూడా ప్రతివారం లాగే థియేటర్స్ లో ‘ఖుషి’, ‘నా… నీ ప్రేమకథ’. వంటి చిత్రాలు రిలీజ్ కి రెడీ అయ్యాయి. ముఖ్యంగా విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న ‘ఖుషి’ పైనే ఎక్కువ అంచనాలు ఉన్నాయి. అయినప్పటికీ.. మరోవైపు ఓటీటీల జోరు మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అందుకు తగ్గట్టుగానే ఓటీటీ లలో వచ్చే కంటెంట్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ప్రేక్షకులు కూడా ఆ కంటెంట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారి ఆసక్తిని గమనించిన ఓటీటీ సంస్థలు కూడా వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్‌ కానున్నాయి. మరి, వాటి లిస్ట్ ఏమిటో చూద్దాం రండి.

ఈ వారం ఓటీటీ లో సందడి చేయబోతున్న చిత్రాలివే..!

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో లో ప్రసారాలు ఇదే :

ది వీల్‌ ఆఫ్‌ టైమ్‌ (వెబ్‌ సిరీస్‌) సెప్టెంబరు 1 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

సోనీలివ్‌ లో ప్రసారాలు ఇదే :

స్కామ్‌ 2003 (హిందీ/తెలుగు సిరీస్‌) సెప్టెంబరు 1 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

జీ5 లో ప్రసారాలు ఇదే :

డీడీ రిటర్న్స్‌ (తమిళ్‌/తెలుగు) సెప్టెంబరు 1 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

నెట్‌ఫ్లిక్స్‌ లో ప్రసారాలు ఇవే :

ఎలోన్‌ (రియాల్టీ షో) ఆగస్టు 30 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

చూజ్‌ లవ్‌ (హాలీవుడ్‌) ఆగస్టు 31 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

వన్‌ పీస్‌ (వెబ్‌సిరీస్‌) ఆగస్టు 31 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

ఫ్రైడే నైట్‌ ప్లాన్‌ (హిందీ) సెప్టెంబరు 1 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

హ్యాపీ ఎండింగ్‌ (హాలీవుడ్) సెప్టెంబరు 1వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

- Advertisement -