ఓటీటీ & థియేటర్స్ లో ఈ వారం !

47
- Advertisement -

ప్రతి వారం లాగే ఈ వారం కూడా థియేటర్స్ లో రెండు భారీ చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. అలాగే ఓటీటీల జోరు కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. ఇక ప్రేక్షకులు కూడా ప్రతి వారం థియేటర్స్ అండ్ ఓటీటీ లలో వచ్చే కంటెంట్ కోసం ఆసక్తిగా ఎదురు చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఈ క్రమంలో ప్రతి వారం లాగే ఈ వారం కూడా థియేటర్స్ అండ్ ఓటీటీల్లో పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్‌ కానున్నాయి. మరి వాటి లిస్ట్ ఏమిటో చూద్దాం రండి

ఈ వారం థియేటర్స్ లో సందడి చేయబోతున్న చిత్రాలివే..!

Also Read:కోల్‌క‌తాపై చెన్నై ఘ‌న విజ‌యం

అఖిల్ ‘ఏజెంట్‌’

అఖిల్‌ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఏజెంట్‌’. ఈ సినిమా ఏప్రిల్‌ 28న థియేటర్‌లలో విడుదల కాబోతుంది. సినిమా పై బాగానే బజ్ ఉంది.

మణిరత్నం ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 2’

మణిరత్నం కలల చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ తమిళ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ‘పొన్నియిన్‌ సెల్వన్‌2’ ఏప్రిల్‌ 28న ప్రపంచవ్యాప్తంగా తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కాబోతుంది. ఈ సినిమా విషయంలో మణిరత్నం చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.

ఇక ఓటీటీ కంటెంట్ విషయానికి వస్తే..

Also Read:రాత్రి పూట ఈ కూరగాయలు తింటే.. అంతే సంగతులు !

నెట్‌ఫ్లిక్స్‌ లో ప్రసారాలు ఇవే :

శ్రీకాంత్‌ దర్శకత్వంలో నాని మాస్‌ యాక్షన్‌ పీరియాడిక్‌ డ్రామా ‘దసరా’. మార్చి 30న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఏప్రిల్‌ 27వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

కోర్ట్‌ లేడీ (హిందీ వెబ్‌సిరీస్‌) ఏప్రిల్‌ 26 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

నోవోల్యాండ్‌(వెబ్‌సిరీస్‌) ఏప్రిల్‌ 26 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

ది గుడ్‌ బ్యాడ్‌ మదర్‌ (వెబ్‌సిరీస్‌) ఏప్రిల్‌ 27 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

ఎకా (హాలీవుడ్) ఏప్రిల్‌ 28 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

బిఫోర్‌ లైఫ్‌ ఆఫ్టర్‌డెత్‌ (హాలీవుడ్) ఏప్రిల్‌ 28 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

అమెజాన్‌ ప్రైమ్‌ లో ప్రసారాలు ఇవే :

పత్తు తల (తమిళ చిత్రం) ఏప్రిల్‌ 27 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

జీ5 లో ప్రసారాలు ఇవే :

యూటర్న్‌ (హిందీ) ఏప్రిల్‌ 28 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

బుక్‌ మై షో లో ప్రసారాలు ఇవే :

స్క్రీమ్‌ 6 (హాలీవుడ్) ఏప్రిల్‌ 26 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

సోనీలివ్‌ లో ప్రసారాలు ఇవే :

తురముఖమ్‌ (మలయాళ చిత్రం) ఏప్రిల్‌ 28 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

Also Read:వామ్మో.. ఇన్ని డ్రామాలా !

డిస్నీ+హాట్‌స్టార్‌ లో ప్రసారాలు ఇవే :

సేవ్‌ ది టైగర్స్‌ (తెలుగు సిరీస్‌) ఏప్రిల్‌ 27 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

పీటర్‌ పాన్‌ అండ్‌ వెండీ (హాలీవుడ్) ఏప్రిల్ 28వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

- Advertisement -