తెలుగు చిత్ర పరిశ్రమలో దిగ్గజ నటులు భువికేగినారు. ఇక ఆ తారాలు సెట్‌చేసిన ట్రెండ్‌ను ఇప్పటికి సినీ ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. తొలినాళ్లలోనే పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు తీసి ఔరా అనిపించిన సూపర్‌స్టార్ కృష్ణ ఇదే యేడాది మరణించారు. ఆయనే కాదు ఇంకా చాలా మంది నటులు చనిపోయారు. ముఖ్యంగా మహేశ్‌బాబు కుటుంబంలో ఈయేడాది తీవ్ర విషాదంను నింపింది. తొలుత అన్న అయిన రమేష్‌బాబు జనవరి 8న మరణించారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి బజార్ రౌడీ ముగ్గురు కొడుకులు వంటి చిత్రాలతో మంచి గుర్తింపు పొందారు. అంతేగాక పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు.
ఏప్రిల్1న ప్రముఖ దర్శకుడు శరత్ క్యాన్సర్‌తో పోరాడి ఓడిపోయి విశ్రాంతి తీసుకున్నారు. ఇక ఇదే నెలలో మరోక దర్శకుడు తాటినేని రామారావు ఏప్రిల్ 20న తుదిశ్వాస విడిచారు. ఏప్రిల్ 9 ప్రముఖ నటుడు బాలయ్య మరణించారు. ఇతను గత పాత తరాలను నేటి కొత్తతరాల నటులకు సహాయ నటుడిగా మంచి గుర్తింపు పొందారు.
టాలీవుడ్ లెజెండరీ రెబల్ స్టార్ కృష్ణం రాజు సెప్టెంబర్ నెలలో మరణించారు. ప్రముఖ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్కు పెద్దనాన్న. ఇతను తన 50యేళ్ల కెరీర్‌లో 180కి పైగా సినిమాల్లో నటించారు. రాధేశ్యామ్ సినిమాలో చివరిగా వెండితెరపై కనిపించారు. కృష్ణంరాజు కేంద్ర సహయ మంత్రిగాను కాకినాడ నరసాపురం నియోజకవార్గాల నుంచి ఎన్నికయ్యారు.
మహేశ్‌బాబు ఇంట్లో మరో విషాదం నింపిన సంవత్సరం కూడా ఇదే. నవంబర్ 15న దిగ్గజ నటుడు నటశేఖరడు సూపర్ స్టార్ కృష్ణ తుది శ్వాస విడిచారు. ఆయన మరణంతో టాలీవుడ్‌లో ఓ శకం ముగిసినట్టుగా కనిపించింది. కృష్ణం రాజు కృష్ణ మరణంతో టాలీవుడ్‌లో ఓశకం ముగిసింది. గతంలో ఎన్టీఆర్ ఏఎన్నార్ శోభన్‌బాబు మరణించిన సంగతి తెలిసిందే. అయితే మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవి సెప్టెంబర్ 28న మరణించింది. కృష్ణ దాదాపుగా 350కి సినిమాల్లో నటించారు. టాలీవుడ్‌లో ఎన్నో ప్రయోగాలు చేసి ఒక కొత్త ట్రెండ్‌ను సెట్‌చేశారు. ఒకే ఏడాదిలో మహేశ్ బాబు ముగ్గుర్ని కోల్పోవడం అత్యంత బాధాకరం. దీంతో పుట్టెడు శోకంలో మునిగిపోయారు. ఇప్పుడిప్పుడే బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు.
డిసెంబర్ నెలలో టాలీవుడ్‌లో మరో ఇద్దరు నటులు కూడా మరణించారు. సీనియర్ నటుడు నవరసనట సార్వభౌమ కైకాల సత్యనారయణ డిసెంబర్ 23న కన్నుమూశారు. విలన్‌గా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు పొందిన కైకాల దాదాపుగా 750కి పైగా చిత్రాల్లో నటించారు. ఈ షాక్ నుంచి టాలీవుడ్ తేరుకోకముందే మరో ప్రముఖ నటుడు చలపతిరావు డిసెంబర్ 25న కన్నుమూశారు. హాస్య, విలన్ పాత్రలకు పేరుగాంచిన అతను దాదాపు 600కు పైగా చిత్రాల్లో నటించారు.
ప్రముఖ టాలీవుడ్ నటుడు వల్లభనేని జనార్ధన్ డిసెంబర్ 29న అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. 120కిపైగా సినిమాల్లో నటించి మెప్పించిన జనార్ధన్…గ్యాంగ్ లీడర్‌లో ఎస్పీ పాత్ర తన సినీ చరిత్రలో ఒక కీలకమైలురాయిగా నిలిచింది.
ఇవి కూడా చదవండి…
అంతా కన్నడ ప్రభంజనమే .!
హిందీలోకి రవితేజ బ్లాక్ బస్టర్?
విషాదం : ప్రముఖ నటుడు మృతి