26 నుండి దసరా సెలవులు

105
school
- Advertisement -

2022 దసరా సెలవులను ప్రకటించింది ప్రభుత్వం. ఈ నెల 26 నుండి అక్టోబర్ 8వ తేదీ వరకు 13 రోజుల పాటు సెలవులను ఇచ్చింది. సెప్టెంబర్ 25, అక్టోబర్ 9వ తేదీన ఆదివారం అవడంతో మొత్తం 15 రోజులు సెలవు దినాలుగా ఉంటాయని తెలిపింది.

అక్టోబర్ 10వ తేదీన విద్యాసంస్థలు తిరిగి ప్రారంభమవుతాని తెలిపింది. దసరా సెలవులను తగ్గిస్తారని ప్రచారం జరిగింది. గత నెలలో భారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు 3 రోజులు సెలవులు ఇచ్చారు. అనుకున్న ప్రకారం దసరా సెలవులు ఇస్తే సమయానికి సిలబస్ పూర్తి కాదని.. ఆ తర్వాత పరీక్షల సమయంలో ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుందని పాఠశాల విద్యాశాఖ యోచిస్తోందని జోరుగా ప్రచారం సాగింది. అయితే ప్రభుత్వం వాటికి చెక్ పెడతూ 15 రోజుల పాటు సెలవులను ఇచ్చింది.

- Advertisement -