గాడ్‌ఫాద‌ర్..ఫ‌స్ట్ సింగిల్

70
chiru
- Advertisement -

మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన చిత్రం గాడ్ ఫాదర్. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ పొలిటికల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ అక్టోబ‌ర్ 5న విడుద‌ల కానుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మ‌రో బిగ్ అప్‌డేట్‌ను ప్ర‌క‌టించారు.

గాడ్‌ఫాద‌ర్ ఫ‌స్ట్ సింగిల్‌ను సెప్టెంబ‌ర్ 15 సాయంత్రం 4.05 నిమిషాల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు. అంతేకాకుండా ప్రోమోను మంగ‌ళ‌వారం సాయంత్రం విడుద‌ల చేయ‌నున్నట్లు తెలిపారు. చిరంజీవి, స‌ల్మాన్‌ఖాన్ ఒకే ఫ్రేమ్‌లో ఉన్న పోస్ట‌ర్‌ను కూడా విడుద‌ల చేశారు.

మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్ట‌యిన లూసీఫ‌ర్‌కు రీమేక్‌గా తెర‌కెక్కింది. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్, సూప‌ర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.

- Advertisement -