కామన్‌వెల్త్‌లో భారత్‌కు మరో స్వర్ణం…

214
2018 Commonwealth Games Gold Coast
- Advertisement -

ఆస్ట్రేలియాలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత వెయిట్ లిఫ్టర్లు పతకాల పంట పండిస్తున్నారు. తొలి రోజు స్వర్ణం, రజతం సాధించిన వెయిట్ లిఫ్టర్లు రెండోరోజు సత్తాచాటారు. ఉమెన్స్ వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌ మళ్లీ స్వర్ణ పతకాన్ని గెలిచింది. 53 కేజీల విభాగంలో లిఫ్టర్‌ సంజిత చాను 192 కేజీ బరువును ఎత్తి గోల్డ్ మెడల్ సాధించింది.

ఛానుకు చేరువలో ఉన్న పాపువా న్యూ గినియా లిఫ్టర్‌ కూడా క్లీన్‌ అండ్‌ జర్క్‌ మూడో అటెంప్ట్‌లో విఫలం కావడంతో భారత్‌కు స్వర్ణం ఖాయమైంది. 2014 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లోనూ 48 కేజీల కేటగిరీలో సంజిత చాను గోల్డ్ మెడల్ సాధించడం విశేషం. గోల్డ్‌కోస్ట్‌లో ఇప్పటివరకు మూడు మెడల్స్ భారత్ ఖాతాలో చేరాయి. మూడూ వెయిట్‌లిఫ్టింగ్‌లోనే కావడం గమనార్హం.

పురుషుల 56 కేజీల విభాగంలో గురురాజా సిల్వర్ మెడల్‌తో భారత్ ఖాతా తెరిచిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వుమెన్స్ 48 కేజీల విభాగంలో మీరాబాయి చాను భారత్‌కు తొలి గోల్డ్ మెడల్ అందించింది. ఇవాళ వెయిట్‌లిఫ్టింగ్‌లో సరస్వతి రౌత్, దీపక్ లాథర్ పోటీలో ఉండటంతో భారత్ మరిన్ని పతకాలు సాధించే అవకాశం ఉంది.

- Advertisement -