2010-19: టెస్టు క్రికెట్ రారాజులు

438
test cricket
- Advertisement -

మరికొద్దిగంటల్లో 2019కి గుడ్ బై చెబుతూ 2020కి గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పేందుకు అంతా సిద్ధమవుతున్నారు. ఇక 2019ని గ్రాండ్‌గా ముగించిన కోహ్లీ సేన 2020లో మరింత మెరుగైన ప్రదర్శన కనబర్చేందుకు సిద్ధమవుతోంది. ఇక 2010 నుంచి 2019 టెస్టు క్రికెట్‌ని పరిశీలిస్తే కొంతమంది ఆటగాళ్లు తమదైన ముద్రవేశారు.

ఓపెనర్లు:

ఇంగ్లాండ్ ఓపెనర్ అలిస్టర్ కుక్, ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఈ దశాబ్దకాలంలో తమ సత్తాచాటారు. వీరిద్దరి కలిసి 23 సెంచరీలు చేయడమే కాదు 67 హాఫ్ సెంచరీలతో 16 వేల పరుగులు చేశారు. వీరితో పాటు కరుణరత్నే,డీన్ ఎల్గర్,గ్రేమ్ స్మిత్,టామ్ లతమ్,మురళీ విజయ్‌ కూడా సత్తాచాటారు.

మిడిల్ ఆర్డర్‌:

మిడిల్ ఆర్డర్‌లో కుమార్ సంగక్కర,స్టీవ్ స్మిత్,విరాట్ కోహ్లీ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చారు. 2015లో క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన సంగక్కర 60.34 యావరేజ్‌తో సత్తాచాటాడు. స్టీవ్ స్మిత్ 62.84 యావరేజ్‌తో ఆసీస్‌కు చిరస్మరణీయ విజయాలను అందించగా కోహ్లీ 27 సెంచరీలతో రాణించాడు. వీరితో పాటు యూనిస్ ఖాన్,మైఖేల్ క్లార్క్,కేన్ విలియమ్సన్,మిస్బాఉల్ హక్,చందర్ పాల్,జో రూట్,పుజారా కూడా రాణించారు.

వికెట్ కీపర్స్‌ :

ఈ దశాబ్దకాలంలో తిరుగులేని ప్రదర్శనతో ఆకట్టుకున్నారు డివిలయర్స్‌. 59.5 యావరేజ్‌తో 7 సెంచరీలు చేశాడు ఏబీ. వీరితో పాటు వాట్లింగ్,డికాక్,హడిన్,సర్ఫరాజ్ అహ్మద్,ముష్కిఫర్ రెహీమ్ కూడా రాణించారు.

స్పిన్నర్స్‌ :

రవిచంద్రన్ అశ్విన్- రంగనా హెరతాలు కలిసి 57 వికెట్లు తీసి సత్తాచాటారు. వీరితో పాటు లయన్,యాసిర్ షా,రవీంద్ర జడేజా,స్వాన్,సయిద్ అజ్మాల్ సత్తాచాటారు.

పేస్ బౌలర్లు :

పేస్ బౌలర్ల విషయానికొస్తే డేల్ స్టెయిన్,అండర్సన్,మోర్కెల్ సత్తాచాటారు. 43.93 యావరేజ్‌తో స్టెయిన్ తిరుగులేని ప్రదర్శన కనబర్చగా అండర్జన్,మోర్కెల్ మోర్నీ కూడా రాణించారు.

- Advertisement -