2019…ట్వీట్టర్‌ టాప్ ట్రెండింగ్‌ వీరే..!

354
twitter

ప్రస్తుతం అంతా ఆన్‌లైన్ ప్రపంచమైంది. పల్లెలు, పట్టాణాలు అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా కంప్యూటర్ల వినియోగం విపరీతంగా పెరిగింది. ఫలితంగా అరచేతిలో ప్రపంచం…మునివేళ్లపై సమాచారం. స్మార్ట్‌ఫోన్లు, చౌక డేటాతో ప్రపంచ సమాచారాన్ని ఒడిసిపట్టే అవకాశం ఇప్పుడు అందరికి అందుబాటులోకి వచ్చింది.

ఒక సోషల్ మీడియా యాప్‌లు ఫేస్ బుక్,ట్విట్టర్‌లు వాడని వారుండరూ. సెలబ్రెటీల దగ్గరి నుంచి సామాన్య ప్రజల వరకు ఈ యాప్‌లను వినియోగిస్తుండటంతో అంతటా క్రేజ్ పెరిగిపోయింది.

ఇక ముఖ్యంగా ట్విట్టర్‌…ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగిన ప్రతి ఒక్కరు తమ అభిప్రాయాలను నిర్మోహమాటంగా వెలువరిస్తున్నారు. అంతేగాదు తమ అభిమాన నటులు,నాయకులను ఫాలో అవుతూ వారి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.

ఇక 2019లో ట్విట్టర్ వేదికగా వారిని పాలో అవుతూ,తమ అభిమాన నటుల హ్యాష్ ట్యాగ్‌లనే షేర్ చేస్తూ ఇతరులకు సమాచారాన్ని చేరవేస్తున్నారు ఫ్యాన్స్. ఈ నేపథ్యంలో ట్విట్టర్‌లో అత్యధికంగా వెతికిన,ట్రెండింగ్‌లో ఉన్న జాబితా విడుదలైంది. తమిళ నటుడు విజయ్ నటించిన బిగిల్ ట్విట్టర్‌ హ్యాష్ ట్యాగ్స్‌లో టాప్ ఇండియన్‌ సినిమాగా నిలిచింది. అంతేగాదు విజయ్ సైతం టాప్ 5లో చోటు దక్కించుకున్నారు. టాలీవుడ్‌లో మహేష్బాబు, రకుల్ ప్రీత్,కాజల్‌ అగర్వాల్‌ గురించి ఎక్కువమంది తెలుసుకునేందుకు ఆసక్తికనబర్చారు.

2019 ఎంటర్‌టైన్మెంట్ విభాగంలో టాప్‌లో నిలిచింది వీరే..

()అమితాబ్ బచ్చన్
()అక్షయ్ కుమార్
()సల్మాన్ ఖాన్
()షారుఖ్ ఖాన్
()విజయ్
()ఏఆర్ రెహ్మాన్
()రణ్‌వీర్ సింగ్
()అజయ్ దేవగన్
()మహేష్ బాబు
()అట్లీ

ఎంటర్‌టైన్‌మెంట్ 2019…టాప్ ఉమెన్ సెలబ్రెటీస్

()సోనాక్షి సిన్హా
()అనుష్క శర్మ
()లతా మంగేష్కర్
()అర్చనా కలపాతి
()ప్రియాంక చోప్రా
()ఆలియా భట్
()కాజల్ అగర్వాల్
()సన్నీ లియోన్
()మాధురి దీక్షిత్
()రకుల్ ప్రీత్ సింగ్