డైరెక్టర్ సుకుమార్ @ 20

18
- Advertisement -

టాలీవుడ్‌కు ఫీల్ గుడ్ లవ్‌స్టోరీలను పరిచయం చేసిన దర్శకుల్లో ఆయన ఒకరు. లవ్ స్టోరీలే కాదు సరికొత్త ప్రయోగాలకు ఆయన కేరాఫ్ అడ్రస్‌. ప్రేక్షకులను 90వ దశకంలోకి తీసుకెళ్లాలన్న, లెక్కలు,ఫిజిక్స్‌తో ప్రేమకథను పండించడమైనా ఆయనకే చెల్లింది. ఇంతకీ ఆయనెవరనుకుంటున్నారా…టాలీవుడ్ లెజంరడీ దర్శకుల్లో ఒకరు సుకుమార్. ఇండస్ట్రీకి పరిచయమై 20 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా ప్రత్యేక కథనం..

2004లో అల్లు అర్జున్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ఆర్య సినిమాతో మెగాఫోన్ పట్టారు సుకుమార్. ఈ సినిమా అప్పట్లో సెన్సేషన్‌. ఈ సినిమా బన్నీకి మంచి టర్నింగ్ పాయింట్‌గా మారింది. ఆ తర్వాత జగడం,ఆర్య 2 వంటి సినిమాలతో మెప్పించారు. ఈ మూడు సినిమాల తర్వాత ప్రేక్షకులకు ఏదో కొత్తదనం అందించాలని 100%లవ్ అంటూ రాగా ఆల్ టైం హిట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేసిన సరికొత్త ప్రయోగం 1 నేనొక్కడ్నే. ఈ సినిమాలో సుకుమార్ దర్శకత్వ ప్రతిభకు మంచిమార్కులు పడ్డాయి. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌ నాన్నకు ప్రేమతో వంటి క్లాసిక్ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్‌తో చేసిన రంగస్థాలం ఎవర్ గ్రీన్ హిట్. రామ్ చరణ్ కెరీర్‌లో ది బెస్ట్ చిత్రాల్లో ఒకటిగా రంగస్థలం నిలవగా సూపర్బ్ టేకింగ్‌తో విమర్శకుల ప్రశంసలను సైతం పొందారు.

బన్నీతో వచ్చిన పుష్ప సంగతి చెప్పనక్కర్లేదు. కథ ఏదైనా ఆ కథకు తగ్గట్టు కథనం, లోకేషన్స్‌ ఔరా అనిపించేలా చేస్తారు సుకుమార్. పుష్ప సినిమాతో బన్నీని పాన్ ఇండియా స్టార్ చేసిన సుక్కు…ప్రస్తుతం పుష్ప 2 షూట్‌లో బిజీగా ఉన్నారు. తొలి సినిమాతోనే నంది అవార్డు గెలుచుకున్న సుకుమార్… ప్ర‌తిభ గ‌ల క‌ళాకారుల‌ను, సాంకేతిక నిపుణుల‌ను ప్రోత్స‌హించ‌డంలో ఎప్పుడు ముందుంటారు. ఆయ‌న ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేసి తొలిచిత్రంతోనే బ్లాక్‌బ‌స్ట‌ర్ విజ‌యాలు అందుకున్న ద‌ర్శ‌కులు ఎంతమందో ఉన్నారు. ఈ 20 ఏళ్ళ కెరీర్‌లో ఎన్నో సంచలనాలకు కేరాఫ్‌గా నిలిచిన సుక్కు…రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని గ్రేట్ తెలంగాణ.కామ్ మనస్పూర్తిగా కోరుకుంటోంది.

Also Read:KTR:బీఆర్‌ఎస్ గెలిస్తేనే తెలంగాణ అభివృద్ధి

- Advertisement -