పాత్ర ఏదైనా.. ఘట్టం ఏదైనా..ఎన్టీఆర్ @ 20

295
ntr
- Advertisement -

ఎన్టీఆర్ ఈ మూడు అక్షరాలే తెలుగు సినిమా, తెలుగు సినిమాయే ఈ మూడు అక్షరాలు. నందమూరి తారక రామారావు… ఈ పేరు వినగానే తెలుగువాడి గుండె ఆత్మగౌరవంతో ఉప్పొంగుతుంది, తెలుగు ఆడియన్స్ హృదయాలు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బు అవుతాయి , అటువంటి మహనీయుడి పేరుతో పాటు రూపాన్నీ పుణికి పుచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ తాతకి తగ్గ మనుమడిగా పేరు తెచ్చుకున్నారు.తాత ఎన్టీఆర్ ని , బాబాయ్ యువరత్న బాలకృష్ణ ని ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ తనదైన మార్క్ తెలుగువారి హృదయాల్లో వేశారు. సరిగ్గా నేటికి ఎన్టీఆర్ వెండితెరపై ఆరంగేట్రం చేసి రెండు దశాబ్దాలు కావొస్తున్న సందర్భంగా పలువురు శుభాకాంక్షలు తెలియ జేస్తున్నారు.

బాలరాముడిగా మెప్పించిన బాల తారకరాముడు.. స్టూడెంట్ నెం.1గా ఆపై సింహద్రిగా, యమదొంగలా, తెలుగింటి ఆడపడుచులకు రాఖిలా, వైవిద్యమైన క్యారెక్టర్లతో ఊసరవెల్లిగా మారి తెలుగు బాక్సాపీస్‌ రూలర్ గా దమ్ము చూపించిన అది ఎన్టీఆర్‌కే చెల్లింది. అనతికాలంలోనే అగ్ర కథానాయకుల జాబితాలో చేరిపోయాడు జూనియర్‌. నందమూరి నట వంశంలో ఈ మూడో తరం హీరోకు లభించిన క్రేజ్‌ మరే హీరోకు దక్కలేదు.

నిన్ను చూడాలని చిత్రం ద్వారా హీరోగా తెరంగేట్రం చేసిన ఎన్టీఆర్… రాజమౌళి డైరక్షన్లో సింహాద్రి అంటూ ఒక్కసారిగా అగ్రస్థానానికి చేరువై అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీ రికార్డ్లు అన్నీ తిరగ రాశాడు.మాటల్లో పవర్ ఉంది , చేష్టల్లో ఎనర్జీ ఉంది , డాన్సు లో ఊపు ఉంది నటనలో పదును ఉంది టోటల్ గా ఎన్టీఆర్ అంటే పర్ఫెక్ట్ స్టార్, ఎన్టీఆర్ ఎలాంటి కారెక్టర్ అయినా అధ్బుతం గా చేయగల హీరో.

సినిమా, సినిమాకీ ఎదుగుతూ తన పరిధిని పెంచుకుంటూ వెళ్తున్నాడు ఎన్టీఆర్. స్వశక్తితో ఎదుగుతున్న ఎన్టీఆర్ ప్రతి సినిమాలో తనదైన ముద్ర వేసేందుకు శ్రమిస్తారు. తాత నందమూరి తారక రామారావు, బాబాయి బాలక్రిష్ణ బాటలోనే జైలవకుశతో త్రిపాత్రాభినయం చేసి మెప్పించాడు తారక్. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్‌తో మల్టీస్టారర్‌ సినిమాలో నటిస్తున్న ఎన్టీఆర్ జయాపజయాలతో నిమిత్తం లేకుండా ముందుకుసాగుతున్నారు. ఎన్టీఆర్ తన వెండి తెర ప్రస్ధానం 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

- Advertisement -