రెండు సంవత్సరాల సమ్మోహనం…

237
sudeer babu
- Advertisement -

సుధీర్‌బాబు హీరోగా మోహ‌న్‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీదేవి మూవీస్ ప‌తాకంపై శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ నిర్మిస్తోన్న‌ చిత్రం స‌మ్మోహ‌నం. బాలీవుడ్ భామ అదితీరావు హైదరీ ఇందులో నాయిక‌గా న‌టించారు. శ్రీదేవి మూవీస్ ప్రొడ‌క్ష‌న్ నెంబ‌ర్ 10గా తెర‌కెక్కుతోన్న స‌మ్మోహ‌నం సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం అంటే జూన్ 15న ప్రేక్ష‌కుల ముందుకువచ్చింది.

సుధీర్ బాబు కెరీర్‌లోనే బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలను పొందింది. విజ్జు (సుధీర్‌ బాబు) అందరు అబ్బాయిల్లా కాకుండా గర్ల్‌ ఫ్రెండ్స్‌, సినిమాలు అంటూ తిరగటం ఇష్టం లేని కుర్రాడు. కాస్త భిన్నంగా ఆలోచించే అలవాటున్న విజ్జు బొమ్మలతొ చిన్నపిల్లల కథల పుస్తకం గీస్తుంటాడు. ఎలాగైన అనగనగా పబ్లికేషన్స్‌ ద్వారా తన బొమ్మల పుస్తకాన్న విడుదల చేయించే ప్రయత్నాల్లో ఉంటాడు. ఈ క్రమంలో హీరోయిన్ సమీరాతో పరిచయం,ప్రేమలో పడటం తర్వాత విడిపోతారు. ఇలా విడిపోయిన వారు ఎలా కలిశారు అన్నదే సమ్మోహనం కథ.

దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి రాసుకున్న కథే ఈ సినిమాకు ప్రధాన బలం. బలమైన పాత్రలతో, సన్నివేశాలతో, భావోద్వేగాలతో నిండిన ఈ కథ ప్రేక్షకుడ్ని సినిమాతో పాటే ప్రయాణించేలా చేసింది. మంచి కథ, ఆసక్తికరమైన పాత్రలతో చిత్రాన్ని అందంగా తీర్చిదిద్దారు దర్శకుడు మోహనకృష్ణ.

ఫన్, ఎమోషన్ వంటి అంశాలని సమపాళ్లలో ఉంచి సగటు ప్రేక్షకుడిని అలరించే సినిమాను తయారుచేశారు. సంగీత దర్శకుడు వివేక్ సాగర్ అందించిన సంగీతం చూపరులకు వినసొంపుగా ఉంటుంది. మ‌రీ ముఖ్యంగా తెలుగు గొప్ప‌ద‌నం గురించి, సినిమా వాళ్ల‌ను చూసి మామూలు జ‌నాలు చెప్పుకొనే మాట‌ల‌ను చాలా రాశారు. మొత్తానికి ఈ సినిమా సగటు ప్రేక్షకుడిని ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది.

- Advertisement -