25 సంవత్సరాల పెదరాయుడు..

288
mohan babu
- Advertisement -

రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో డైలాగ్ కింగ్ మోహన్ బాబు, సూపర్ స్టార్ రజనీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పెదరాయుడు. సరిగ్గా 25 సంవత్సరాల క్రితం ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం ఆల్ టైం తెలుగు సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అన్నదమ్ముల అనుబంధం గురించి తెలుగు తెరపై ఆవిష్కృతమైన బ్లాక్‌బస్టర్‌ చిత్రాల్లో ‘పెదరాయుడు’ ఒకటిగా నిలిచింది.

సినిమాలోని పాటలు, డైలాగ్‌లు ఇప్పటికి ప్రేక్షకులకు గుర్తిండే ఉంటాయి. పెదరాయుడిగా మోహన్ బాబు,పాపారాయుడిగా రజనీ నటన సూపర్బ్. ఈ సినిమా ముహుర్తపు షాట్‌కు ఎన్టీఆర్ క్లాప్ కొట్టగా ఆయనే తిరిగి 200 రోజుల ఫంక్షన్‌కి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. మోహన్ బాబు కెరీర్‌లోనే ఎప్పటికి చెప్పుకునే చిత్రంగా నిలిచింది.

పెదరాయుడు 25 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు మోహన్ బాబు. ఈ చిత్రాన్ని రీమేక్‌ చేయడం అసాధ్యం అనుకుంటున్నా. భవిష్యత్తులో విష్ణు, మనోజ్‌కి సీక్వెల్‌ చేసే అవకాశం ఉండొచ్చేమోనని తెలిపారు. అయితే ఆ రోజుకీ, ఈ రోజుకీ పెదరాయుడు చరిత్ర మరచిపోలేని సినిమా. ఆ సినిమా ఒక చరిత్ర అని తెలిపారు మోహన్ బాబు.

- Advertisement -