సాగర్ కు పెరిగిన వరద…2గేట్లు ఎత్తివేత

429
nagarjyunasagar
- Advertisement -

ఎగువన భారీగా వర్షాలు కురుస్తుండటంతో నాగార్జున సాగర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీనికి తోడు శ్రీశైలం ప్రాజెక్ట్ కు వచ్చిన వరద నీరును దిగువకు వదులుతున్నారు. సాగర్‌కు ఇన్‌ఫ్లో- 60,649 క్యూసెక్కులు వస్తుండటంతో 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 312 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

గత రెండు రోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం మళ్లీ పెరిగింది. జురాల నుంచి శ్రీశైలానికి లక్షకు పైగా క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. శ్రీశైలం జలాశయ పూర్తి నీటినిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా ప్రస్తుతం 211 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీశైలం కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తున్నారు.

- Advertisement -