ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా పై నిత్యం అనేక పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. ఇప్పటికే, “దేవర” సినిమా విడుదల వాయిదా పడింది. ఏప్రిల్ 5న విడుదల కావాల్సిన “దేవర” మరో కొత్త డేట్ ని వెతుక్కుంటోంది. ఈ లోపు ఈ సినిమా పై మరో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. రెండున్నర గంటల్లో చెప్పే కథకు ముగింపు ఇవ్వడం ఓ విధంగా ఈజీ. స్టార్టింగ్ – ఎండింగ్ ముందే అనుకుంటారు. అదే సినిమాను పార్ట్-1, పార్ట్-2గా తీసినప్పుడు మాత్రం మొదటి భాగానికి ముగింపు ఇవ్వడం చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారం. ‘దేవర’ సినిమాకి కూడా ప్రస్తుతం ఈ ఇబ్బందే ఎక్కువ ఉందట.
ముఖ్యంగా ‘దేవర’ రెండో భాగంపై ఆసక్తి రేకెత్తించేలా ‘దేవర’ పార్ట్ 1 క్లైమాక్స్ ఉండాలి, అదే విధంగా పార్ట్-1, ఏమాత్రం తగ్గకుండా ఉండాలి. అందుకేనేమో, దేవర పార్ట్-1 కోసం ఏకంగా 2 క్లైమాక్స్ లను దర్శకుడు కొరటాల శివ ప్లాన్ చేస్తున్నాడు. అవును.. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘దేవర’ సినిమా మొదటి భాగాన్ని ఎలా ముగించాలనే అంశంపై ఇంకా డిస్కషన్లు సాగుతున్నాయంట. దీనికి సంబంధించి రెండు రకాల క్లైమాక్స్ లు అనుకున్నారట. రెండు క్లైమాక్స్ లు అటు ఎన్టీఆర్ కి, ఇటు కొరటాల శివకి కూడా చాలా బాగా నచ్చాయి.
మరి ఏది ఫైనల్ చేస్తారో చూడాలి. ఎన్టీఆర్ సినిమాలకే ఎక్కువగా ఇలా జరుగుతోంది. జనతా గ్యారేజ్, అరవింద సమేత సినిమాల టైమ్ లో కూడా ముగింపునిచ్చే విషయంలో మల్లగుల్లాలు పడ్డారు. ఇక తాజాగా రాబోతున్న దేవర పార్ట్-1 క్లైమాక్స్ కోసం కూడా చాలా వర్క్ చేస్తున్నారు. దేవర సినిమా సముద్రం నేపథ్యంలో జరుగుతుంది. రివెంజ్ డ్రామాగా ఈ సినిమా కథను కొరటాల శివ తన మార్క్ ఉండేలా కథని రాసుకున్నారట.
Also Read:చౌర్య పాఠం…అదిరిపోతుంది

