యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో ‘2.ఓ’..

216
2.0 Telugu Video song
- Advertisement -

శంకర్ దర్శకత్వంలో సూపర్‌ స్టార్‌ రజినీకాంత్, బాలీవుడ్‌ హీరో అక్షయ్‌కుమార్‌ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘2.ఓ’. ఈ సినిమా నవంబర్‌ 29వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ 14కోట్ల వ్యూస్ ని అందుకుని – రికార్డ్ స్థాయిలో 20కోట్ల వ్యూస్ దిశగా దూసుకెళుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై అభిమానులకు ఉన్న ఉత్కంఠ ఏపాటిదో ట్రైలర్ కు దక్కుతున్న ఆదరణ చెబుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా తెలుగు వెర్షన్ కి సంబంధించిన లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు.

2.0 Telugu Video song

“నా ప్రియమౌ ప్రియమో బ్యాటరివే విడిచి వెళ్లిపోవద్దే .. నా ప్రియమౌ ప్రియమో బ్యాటరివే అసలేం తరగొద్దే .. యంతర లోకపు సుందరివే .. అంకెల కవితలు సెండుదువే” అంటూ ఈ పాట కొనసాగుతోంది. ఏఆర్ రెహ్మాన్ స్వరపరిచిన ఈ పాట ప్రేక్షకులను ఎంతోగానో ఆకట్టుకోంటుంది. యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారింది. దాదాపు 550కోట్ల బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రజినీ సరసన అమీజాక్సన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది.

- Advertisement -