కోనాయిపల్లిలో సీఎం కేసీఆర్‌ ప్రత్యేకపూజలు

188
kcr konaipalli
- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎర్రవెల్లిలోని తన వ్యవసాయక్షేత్రం నుంచి తనకిష్టదైవమైన నంగునూరు మండలంలోని కోనాయిపల్లి వెంకన్న సన్నిధికి కేసీఆర్ నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ తో పాటు ఇతర నేతలు పాల్గొన్నారు.

ఇక్కడి నుంచి నేరుగా గజ్వేల్‌కు చేరుకొని మధ్యాహ్నం 2.34 గంటలకు ఆర్డీవో కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేయనున్నారు. సిద్దిపేటలో 2.45 గంటలకు మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట ఆర్డీవో కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేస్తారు.సీఎం కేసీఆర్ రాక నేపథ్యంలో పోలీసులు పటిష్టబందోబస్తును ఏర్పాటుచేశారు.

ఐదు దశాబ్దాలక్రితం కోనాయిపల్లి గ్రామానికి చెందిన గూడెపు ఎల్లారెడ్డికి వేంకటేశ్వరస్వామి కలలో కనిపించి, దీర్ఘరోగాల నివారణకు చెట్టు మందును చెప్పాడని గ్రామస్థులు పేర్కొంటుంటారు. స్వామి ఆజ్ఞమేరకు ఎల్లారెడ్డి తెల్లవారుజామున అడవికి వెళ్లి, చెట్ల మందును తీసుకువచ్చి పోయడం ప్రారంభించారు. రోగాలు నయమవుతాయన్న నమ్మకంతో ఈ మందుకు ఆదరణ పెరిగింది. అప్పటినుంచి ఏటా మాఘమాసంలో వార్షికోత్సవాలు నిర్వహిస్తున్నారు.

- Advertisement -