సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం 2.O. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ ప్రతినాయకుడిగా నటిస్తుండగా.. అమీ జాక్సన్ కథానాయికగా నటించింది. శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మరో మూడు రోజుల్లో (నవంబర్ 29న) విడుదల కానున్న ఈ మూవీకి భారీ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇదివరకే ట్రైలర్,పాటలు ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. ఈ సినిమా కోసం దాదాపు 500 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
ఇక ఈ మూవీ విడుదలకు ముందే దాదాపుగా పెట్టుబడి వెనక్కి వచ్చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. కేవలం శాటిలైట్.. డిజిటల్ హక్కుల రూపంలోనే ‘2.0’ నిర్మాతలకు రూ.180 కోట్ల ఆదాయం దక్కినట్లు కోలీవుడ్ మీడియా రిపోర్ట్ చేస్తోంది. అన్ని భాషలకూ కలిపి ‘2.0’ శాటిలైట్ హక్కుల్ని రూ.120 కోట్లకు అమ్మినట్లు సమాచారం.
ఇది ఇండియన్ సినిమాల్లో రికార్డని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరోవైపు డిజిటల్ హక్కుల రూపంలో ‘2.0’ ఇంకో రూ.60 కోట్లు తెచ్చిపెట్టిందట. ఇది కూడా రికార్డే. మొత్తంగా బిజినెస్ విషయంలోనూ ఇండియన్ సినిమాల రికార్డుల్ని ‘2.0’ తుడిచిపెట్టేసిందని అంటున్నారు.