సూపర్ స్టార్ రజనీకాంత్,శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 2.ఓ. 450 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రతీనాయక పాత్రలో నటిస్తున్నారు. బ్రిటీష్ బ్యూటీ అమీజాక్సన్ హీరోయిన్గా కనిపించనున్నారు. శంకర్ అత్యున్నత సాంకేతిక విలువలతో పూర్తిస్థాయి త్రీడి చిత్రంగా 2.ఓను రూపొందిస్తున్నారు.
‘2.O’ సినిమాని ముందుగా జనవరి 25న రిలీజ్ చేయడానికి నిర్మాతలు ప్రయత్నించారు. కానీ, విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఆలస్యం కారణంగా అనుకున్న తేదీకి విడుదల చేయలేకపోయారు. తాజాగా నిర్వహించిన ఫాన్స్ మీట్లో.. ఈ మూవీ ఏప్రిల్ 14న విడుదల కాబోతోందని రజనీయే స్వయంగా వెల్లడించారు.
జనవరి 6న చిత్ర టీజర్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఒకేసారి తమిళ, తెలుగు, హిందీ భాషల్లో టీజర్ రిలీజ్ చేయనున్నారు. మలేసియాలో జరుగుతున్న కోలీవుడ్ స్టార్ నైట్లో ఈ వేడుకని నిర్వహించనున్నారు.