సూపర్ స్టార్ రజనీకాంత్-టెక్ మాంత్రికుడు శంకర్ కాంబోలో తెరకెక్కిన చిత్రం 2.0. రజనీ సరసన అమీజాక్సన్ హీరోయిన్గా నటించగా అక్షయ్ కుమార్ ప్రతినాయకుడిగా నటించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకురానుంది. సినిమా ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన దర్శకుడు శంకర్ తెలుగులో మాట్లాడి అందరిని ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేశారు. 2.0 ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్. ఈ చిత్రంలో ప్రతి నాయకుడిగా నటించిన అక్షయ్ కుమార్ చాలా కష్టపడ్డారని తెలిపారు. సుమారు నాలుగు గంటల పాటు మేకప్ వేసుకునేవారు. ఆయన లైఫ్‌లో ఇంత మేకప్ ఎప్పుడూ వేసుకోలేదన్నారు.
క్లైమాక్స్ ఢిల్లీలో షూట్ చేశాం. అప్పుడు 47 డిగ్రీలో వేడిలో పనిచేయాల్సి వచ్చింది. అప్పుడు రజినీకాంత్ హెల్త్ బాలేకపోవడంతో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. సుమారు 500 వందల మంది టెక్నీషియన్లు, అక్షయ్ కుమార్ అందరూ రెడీగా ఉన్నారని చెప్పారు.షూటింగ్ కాన్సిల్ చేస్తే.. చాలా నష్టం వచ్చేది. హెల్త్ కండిషన్ బాలేకపోయినా క్లైమాక్స్ పూర్తి చేశారు. అదీ సూపర్ స్టార్‌లో ఉన్న క్వాలిటీ అని కొనియాడారు. ఈ కార్యక్రమానికి రజినీకాంత్, దర్శకుడు శంకర్, ప్రతి నాయకుడు అక్షయ్ కుమార్‌లతో పాటు తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న నిర్మాతలు ఎన్ వీ ప్రసాద్, దిల్ రాజులు హాజరయ్యారు.