6వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మెగా ప్లాంటేషన్‌కు శ్రీకారం చుట్టనున్నారు మంత్రి కేటీఆర్. ఒక్కరోజే లక్షకు పైగా మొక్కలు నాటే కార్యక్రమంను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిపి ప్రారంభించనున్నారు.
మానేరు వాగు వెంట 35 కిలో మీటర్ల మేర ఒకే రోజు 53 వేల మొక్కలు నాటేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఉదయం 11:00గంటలకు ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట మండలంలోని ఆవునూర్-వెంకటాపూర్ మానేరు వాగులో హరితహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమానికి కేటీఆర్,స్పీకర్ పోచారం హాజరు
కానున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు వెంకటాపూర్లో సిరిసిల్ల పట్టణ అర్బన్ లంగ్ స్పేస్ పార్క్ కు శంకుస్థాపన చేయనున్నారు.ఇక జిల్లావ్యాప్తంగా శుక్రవారం లక్షకు పైగా మొక్కలు నాటేందుకు అధికారయంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. మెగాప్లాంటేషన్ పేరుతో ముస్తాబాద్ మండలం
ఆవునూరు-ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ సరిహద్దులో గల మానేరు తీరంలో నిర్వహించే కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించనున్నారు. జిల్లాలో 54 లక్షలకు పైగా మొక్కలు నాటాలని వివిధ శాఖలు లక్ష్యాలు విధించుకోగా, శుక్రవారం ఒక్కరోజే లక్షకుపైగా మొక్కలు నాటనున్నారు.