క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ 19వ సీజన్ నేటి నుంచి ఘనంగా ప్రారంభమవుతోంది. రెండు నెలల పాటు సాగే ఈ మెగా టోర్నీ దేశవ్యాప్తంగా ఉత్సాహాన్ని నింపనుంది. సీజన్ తొలి మ్యాచ్‌లో ఆర్సీబీతో తలపడనుంది సర్‌రైజర్స్ హైదరాబాద్. చినస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
హోమ్ గ్రౌండ్‌లో ఆడుతున్న ఆర్సీబీ ఈసారి గెలుపుతో ప్రారంభించాలని భావిస్తోంది. అభిమానుల భారీ మద్దతుతో తమ సత్తా చాటాలని జట్టు సిద్ధమైంది.ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ సీజన్‌లో కొత్త వ్యూహాలతో బరిలోకి దిగుతోంది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని బలమైన ప్లానింగ్‌తో మ్యాచ్‌లో అడుగుపెడుతోంది. తొలి మ్యాచ్ నుంచే విజయంతో తమ ప్రస్థానాన్ని ప్రారంభించాలని చూస్తోంది.
Also Read:జుట్టు ఊడిపోవడం…పరిష్కారం!
ఈసారి ఐపీఎల్‌లో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. మొత్తం 74 మ్యాచ్‌లు జరుగనున్న ఈ టోర్నీ దాదాపు రెండు నెలల పాటు కొనసాగుతుంది. ప్రతి జట్టు ప్లేఆఫ్స్ చేరేందుకు పోటీపడనుంది.ఐపీఎల్ ప్రారంభం కావడంతో క్రికెట్ అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది. ప్రతి మ్యాచ్ థ్రిల్లింగ్‌గా సాగనుండటంతో అభిమానులు టోర్నీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

