దేశ ఆర్థిక రాజధాని ముంబయిని కుదిపేసిన 1993 వరుస పేలుళ్ల కేసులో గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు అబూ సలేమ్‌కు ముంబై పేలుళ్ల కేసులో అబూ సలేమ్‌కు జీవిత ఖైదు శిక్ష విధించింది టాడా కోర్టు . ఈ కేసులోఇద్దరికి మరణ శిక్ష విధించిన కోర్టు, కరీముల్లా ఖాన్, అబు సలెంలకు జీవిత ఖైదు విధించింది. కుట్ర ఆరోపణలు, హత్య, ఉగ్ర కార్యకలాపాల తదితర నేరాల కింద వీరిని న్యాయస్థానం దోషులుగా తేల్చింది. టాడా కోర్టు ఇవాళ ఈ శిక్షను ఖరారు చేసింది.
ఇదే కేసులో టైగర్ మెమన్‌కు కూడా గతంలో జీవిత శిక్షను ఖరారు చేసిన టాడా కోర్టు.. ముంబై పేలుళ్ల కేసులో మరో ఇద్దరు దోషులు తాహిర్ మర్చెంట్, ఫిరోజ్‌ఖాన్‌లకు మరణశిక్షను విధించించి. ఇదే కేసులో మరో దోషి రియాజ్ సిద్ధికీకి పదేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. ముంబై పేలుళ్ల కేసులో తాహీర్ కీలక దోషి. ఆయుధ శిక్షణ కోసం అతను భారతీయ యువతను పాకిస్థాన్‌కు పంపించాడు. గ్యాంగ్‌స్టర్ అబూ సలేమ్‌కు డబ్బు, కారు అందజేయడంలో రియాజ్ కీలక పాత్ర పోషించాడు.
అబూ సలెమ్‌ను 2005లో పోర్చుగల్ నుంచి పట్టుకొచ్చారు. గుజరాత్ నుంచి ముంబైకి సలెమ్ మారణాయుధాలను సరఫరా చేశాడన్న అభియోగాలు ఉన్నాయి. ఆ ఆయుధాలను బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కు కూడా అప్పగించింది అబూ సలెమే. ఏకే 56 రైఫిళ్లు, బుల్లెట్లతో పాటు హ్యాండ్ గ్రేనేడ్లు కలిగి ఉన్న కేసులో సంజయ్ దత్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ముంబై లో జరిగిన ఆర్డీఎక్స్ పేలుళ్లకు సూత్రధారి ముస్తాఫా డోసా అని తెలింది. సుమారు మూడు వేల కిలోల ఆర్డీఎక్స్‌ను డోసా ఉగ్రమూకలకు అందించినట్లు అనుమానాలున్నాయి. ముంబై పేలుళ్ల కేసుతో తనకు లింకు ఉన్నట్లు గ్యాంగ్‌స్టర్ అబూ సలెమ్ సీబీఐ విచారణ ముందు అంగీకరించారు.