అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలిగా ప్రభాస్ నటనకు తెలుగు సినిమానే కాదు.. బాలీవుడ్ ప్రేక్షకులు, విమర్శకులు శభాష్ అన్నారు. ఇంటర్నేషనల్ రేంజ్లో ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ సినిమానే కాదు.. దాన్ని మించేలా సినిమాలు చేయగల టాలీవుడ్ ఉందని తెలిసింది.బాహుబలి తర్వాత ఆల్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ ఈస్థాయికి చేరుకోవడానికి చాలానే కష్టపడ్డారు. 19 ఏళ్లకు పైగా ఆయన కష్టం, అంకిత భావం, సినిమాలపై ఉన్న ప్యాషన్‌తో విభిన్నమైన చిత్రాలు చేసి అన్నివర్గాల ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు ..
ఈ నేపథ్యంలో ప్రభాస్ ఇండస్ట్రీలోకి వచ్చి 19 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా #19YearsForPrabhas అనే హ్యాష్‌ట్యాగ్‌తో సంబరాలు చేసుకుంటున్నారు. దర్శకుడు జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన “ఈశ్వర్” చిత్రం 2002 నవంబర్ 11న విడుదలైంది. ఈ సందర్భంగా ప్రభాస్ అభిమానులు ట్విట్టర్లో ఈ ప్రత్యేకమైన రోజును ఫోటోతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
బాహుబలితో రెబల్‌స్టార్ ప్రభాస్ రేంజ్ మారిపోయింది. బాహుబలి2 తర్వాత ప్రభాస్‌తో యువి క్రియేషన్స్ సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ‘సాహో’ తెలుగు, తమిళ్, హిందీ, మలయాళ భాషల్లో రూ.350కోట్లతో భారీ బడ్జెట్, హైటెక్నికల్ వేల్యూస్‌తో ప్యాన్ ఇండియా చిత్రంగా రూపొందిన చిత్రం ‘సాహో’. బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ నటించింది.
తెలుగు సినీ ప్రేక్షకులు గర్వపడేలా చేస్తున్న ప్రభాస్ ప్రస్తుతం ఆదిపురుష్, సలార్, స్పిరిట్, రాధే శ్యామ్, ప్రాజెక్ట్ కే వంటి చిత్రాల్లో నటిస్తున్నారు.