పొగమంచు..కాలుష్యం కారణంగా ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కసారిగా వాతావరణం పొగమంచుతో కమ్మేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం యమునా ఎక్స్‌ప్రెస్ వేను పొగమంచు కమ్మేయడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. 18 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ముందుగా ఒక బస్సు ట్రక్కును ఢీకొంది. రహదారిపై బస్సు..టక్కు ఆగిపోయాయి. కానీ అదే రహదారిపై వస్తున్న ఇతర వాహనాలకు ఈ దృశ్యం కనిపించలేదు. దీనితో వేగంగా వస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 20 మంది తీవ్రగాయాలపాలయ్యారు.
గాయపడిన వారిని నోయిడా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వాహనాల్లోని ప్రయాణీకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వాహనాల్లో నుండి దిగి బయటకు పరుగులు తీశారు. మున్ముందు ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయోనని ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. కాలుష్యం ఒకవైపు..మరోవైపు కాలుష్యం వెదజల్లుతుండడంతో ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నారు. వాయు కాలుష్యం కారణంగా.. భారత వైద్య మండలి ఢిల్లీలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించింది.