దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ అరాచకం.. చేతులు మారుతున్న నోట్ల కట్టలు..

227
siddipte bjp
- Advertisement -

దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ పార్టీ అరాచకమైన పనులకు దిగజారింది. సిద్దిపేట‌లో దుబ్బాక బీజేపీ అభ్య‌ర్థి ర‌ఘునంద‌న్ రావు బంధువు ఇంట్లో పోలీసులు, రెవెన్యూ అధికారులు సోమ‌వారం త‌నిఖీలు చేశారు. త‌నిఖీల్లో భాగంగా ఆ ఇంట్లో ఉన్న‌ రూ. 18.67 ల‌క్ష‌ల‌ను పోలీసులు, రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోదాలు జ‌రిపిన బంధువు ఇంటికి ర‌ఘునంద‌న్ రావు చేరుకున్నారు. ఈ క్ర‌మంలో పోలీసులు, బీజేపీ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

ఓటమి తప్పదని ప్రలోభాలకు తెరలేపిన కాషాయం పార్టీ సిద్దిపేటలో బీజేపీ అభ్యర్థి బంధువు ఇంట్లో పెద్దఎత్తున డబ్బు మూటలు చేతులు మారుతున్నాయని సమాచారం తెలుసుకుని పోలీసులు సోదాలకు వెళ్లారు. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి బంధువు అంజన్రావు ఇంట్లో పెద్ద ఎత్తున నగదు స్వాదీనం చేసుకున్నారు. సంఘటనా స్థలంలో బీజేపీ అభ్యర్థి మందీమార్బలంతో వచ్చి పోలీసులకు అడ్డుతగిలారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదును బీజేపీ కార్యకర్తలు దౌర్జన్యంగా లాక్కున్నారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న పోలీసులపై బీజేపీ కార్యకర్తల దౌర్జన్యం చేశారు.

బీజేపీ కార్యకర్తలు ఎన్నికల విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా.. అరాచకం సృష్టించారు. డబ్బు కట్టలను లాక్కుని పైకి చూపిస్తూ పరుగులు పెట్టారు. అంతేకాదు రెడ్ హ్యాండెడ్‌గా దొరికినా పోలీసులను ఉల్టా దబాయించారు బీజేపీ నాయకులు. సిద్దిపేటలో నోట్ల కట్టలతో బీజేపీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినా.. నిస్సిగ్గుగా వెనకేసుకొస్తోంది వీ6 ఛానల్. మొన్నటికి మొన్న రూ. 40 లక్షలు.. ఇవాళ రూ. 18 లక్షలు పట్టుబడ్డ డబ్బుల పార్టీలకు కొమ్ముకాస్తున్నది వీ6 ఛానల్. చట్టం తనపని తాను చేస్తుంటే టీఆర్ఎస్ నాయకులపై నోరుపారేసుకుంటున్నారు బీజేపీ నేతలు. దుబ్బాక ఉప ఎన్నిక‌కు న‌వంబ‌ర్ 3న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. 10వ తేదీన ఓట్ల‌ను లెక్కించ‌నున్నారు.

- Advertisement -