వచ్చే ఎన్నికల్లో 175 స్థానల్లోనూ విజయం సాధించాలని ఏపీ సిఎం జగన్ పట్టుదలగా ఉన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ఆయా విధానాలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, దాంతో వచ్చే ఎన్నికల్లో కూడా ప్రజలు వైసీపీ సర్కార్ కే మొగ్గు చూపుతారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఈసారి కేవలం విజయం మాత్రమే కాకుండా రాష్ట్రంలో అని స్థానాలను క్లీన్ స్వీప్ చేసి చరిత్ర సృస్టించాలని వైఎస్ జగన్ టార్గెట్ పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగానే ప్రణాళికలు రచిస్తూ వై నాట్ 175 అనే నినాదాన్ని పార్టీ నేతలకు ఎమ్మెల్యేలకు బలంగా వినిపిస్తున్నారు.
అయితే జగన్ ఆశిస్తున్నట్లుగా 175 స్థానాల్లో విజయం సాధ్యమేనా అనే దానిపై ప్రత్యర్థి పార్టీలు సైతం ఎద్దేవా చేస్తున్నాయి. ముందు 175 స్థానాల్లో రోడ్లు వేయాలంటూ జగన్ ప్రభుత్వానికి చురకలు అంటిస్తున్నాయి. ఇక 175 స్థానాల్లో విజయం సాధించడం కష్టమే అనేది సొంత పార్టీనేతల్లో కూడా వినిపిస్తుందట. తాజాగా మాజీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే, క్లీన్ స్వీప్ చేయడం కష్టమే అనే భావనకు ఆయన వచ్చినట్లు తెలుస్తోంది. ఆయన మాట్లాడుతూ.. ” ఈసారి ఎన్నికల్లో 151 స్థానాలకు పైగా విజయం సాధిస్తామని , 18 స్థానాల్లో మాత్రమే పోటాపోటి నెలకొనే అవకాశం ఉందని జోష్యం చెప్పారు.
ఒకవైపు వైఎస్ జగన్ వై నాట్ 175 అంటూ ఉంటే.. ఇంకోవైపు నేతలేమో అబ్బే కష్టమే అని పెదవి విరుస్తున్నారు. దీంతో 175 సీట్లను సాధిస్తామని చెప్పి జగన్ తొందరపడ్డారా ? అనే సందేహం వస్తుంది. ఎందుకంటే అనుకున్న టార్గెట్ రిచ్ అవకపోతే ప్రజల్లో హాస్యాస్పదంగా మారే అవకాశం ఉంది. దాంతో పార్టీపై కొంత నెగిటివిటీ కూడా స్పెడ్ అయే అవకాశం ఉంది. మరి వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు సాధించడంపై సొంత పార్టీ నేతల్లోనే నమ్మకం లేకపోవడంతో జగన్ అనుకున్న టార్గెట్ రిచ్ అవుతారా లేదా అనేది చూడాలి. ? ఎన్నికలకు ఏడాదిన్నర సమయం మాత్రమే ఉంది. ఈ లోగా వై నాట్ 175 టార్గెట్ కోసం వైఎస్ జగన్ ఎలాంటి వ్యూహాలు రచిస్తారో చూడాలి.
ఇవి కూడా చదవండి…