భారతదేశ చరిత్రలో అత్యంత చీకటి అధ్యాయంగా నిలిచిన 26/11 ముంబై ఉగ్రదాడికి నేటికి సరిగ్గా 17 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రపంచ ఉగ్రవాద దాడుల్లోనే ఇది అత్యంత ఘోరమైన ఘటనగా చరిత్రలో నమోదైంది.
2008, నవంబర్ 26న, పాకిస్థాన్‌లోని కరాచీ రేవు నుంచి అరేబియా సముద్రం ద్వారా ముంబైలోకి చొరబడిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు మారణకాండకు పాల్పడ్డారు. అజ్మల్ కసబ్ సహా మొత్తం 10 మంది ముష్కరులు నాలుగు రోజుల పాటు ముంబై నగరాన్ని భీతావహం చేశారు.
ప్రధాన లక్ష్యాలు:
తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్
ఒబెరాయ్ ట్రైడెంట్ హోటల్
ఛత్రపతి శివాజీ టెర్మినల్ (CST)
ఈ క్రూరమైన దాడిలో మొత్తం 166 మంది అమాయక ప్రజలు మరియు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోగా, 300 మందికి పైగా గాయపడ్డారు. ఈనాటికీ, ఆ ఉగ్ర అరాచకాన్ని, తమవారిని కోల్పోయిన బాధను బాధిత కుటుంబాలు మర్చిపోలేకపోతున్నాయి. యావత్ దేశం ఆ అమరులకు నివాళులు అర్పిస్తోంది.
Also Read:లోకల్ బాడీ ఎన్నికలు..మండలాల వారీగా వివరాలు

