- Advertisement -
దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. గత 24గంటల్లో 1,68,063 కేసులు నమోదుకాగా 277 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 8,21,446 యాక్టీవ్ కేసులుండగా ఇప్పటి వరకు 152 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్టు వైద్యశాఖ వెల్లడించింది.
కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో ఢిల్లీ, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల్లో వీకెండ్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. నైట్, వీకెండ్ కర్ఫ్యూలు అమలు చేస్తూనే వ్యాక్సినేషన్‌ను వేగంగా అమలు చేస్తున్నారు. 2.75 కోట్ల మంది 60 ఏళ్లు దాటిన వారికి, కోటి మంది హెల్త్ వర్కర్లకు, రెండు కోట్ల మంది ఫ్రంట్‌లైన్ వారియర్లకు ప్రికాషనరీ డోస్‌లు వేస్తున్నారు.
- Advertisement -