సినిమా సూపర్ హిట్ అయిందా.. అయితే ఓ వారం ఇరగదీస్తుందిలె. అదేంటి అంటే రెండో వారానికి ఇంకో నాలుగు సినిమాలుంటాయి కదా. వాటిలొ ఒకటి రెండొ బాగుంటాయి కదా అనే టాక్ ఇండస్ట్రీ లో ఎక్కువగా వినిపిస్తుంటుంది. అయితె గత వారం విడుదలైన “16” సినిమా మాత్రం రెండో వారంలోను తన వసూళ్ల హవాను కొనసాగిస్తోంది. తమిళ్లో సూపర్ హిట్ అయినప్పుడే 16 సినిమా తెలుగు హక్కులను తీసుకొన్న చదలవాడ లక్మణ్ మరోసారి తన అభిరుచి ని చాటుకున్నారు. గతేడాది “బిచ్చ గాడు” తో భారీ హిట్ కొట్టిన చదలవాడ బ్రదర్స్ అదే సక్సెస్ 16 సినిమాతో కంటిన్యూ చేస్తున్నారు.
రెహ్మాన్ లాంటి సీనియర్ తొ ఓ సాదాసీదా పాయింట్ ను గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ఎక్స్ ట్రార్డినరీ గా ప్రెజెంట్ చేసిన 21 ఏళ్ల కార్తీక్ నరేన్ దర్శకత్వ ప్రతిభే 16 విజయానికి ప్రధాన బలం. ఇక రెహ్మాన్ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ సైతం మరో హైలెట్ గా నిలిచింది.తొలి వారం కేవలం మల్టీప్లెక్స్ లకే పరిమితమైన 16 చిత్రానికి రెండో వారం వచ్చె సరికి సింగిల్ స్క్రీన్ల తొ పాటు, బెంగళూరు సిటీ లోనూ ఈ సినిమా భారీగా విడుదలవుతొంది. సినిమా బాగుంటే అది ఏ సెంటర్ అయినా ఏ వారమైనా బాగా ఆడుతుందనటానికి 16 సినిమా విజయమే నిదర్శనం..