21న కార్తీ … ‘చెలియా’ ఆడియో

232
Cheliyaa Audio On March 21st
- Advertisement -

మణిరత్నం అంటే ఓ బ్రాండ్. లవ్‌… రొమాన్స్‌… సాంగ్స్‌… మణిరత్నం సినిమాలంటే ఇవేకాదు. ‘రోజా’, ‘దిల్‌ సే’ సినిమాల్లో టెర్రరిజమ్, ‘బొంబాయి’లో మత ఘర్షణలు వంటి సున్నితమైన అంశాలను తెరపై హృద్యంగా ఆవిష్కరించారు. తాజాగా మళ్లీ అలాంటి సున్నితమైన కథతో ముందుకువస్తున్నాడు. తమిళ హీరో కార్తీ, బాలీవుడ్‌ భామ అదితీరావు హైదరీ జంటగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న తమిళ సినిమా ‘కాట్రు వెళియిడై’.

తెలుగులో ‘చెలియా’ పేరుతో ‘దిల్‌’ రాజు విడుదల చేస్తున్నారు. ఇందులో హీరో ఆర్మీ ఆఫీసర్‌ కమ్‌ పైలట్, హీరోయిన్‌ డాక్టర్‌. పైలట్‌, డాక్టర్ కి మధ్య చిగురించిన ప్రేమ కథే ఈ చిత్రం. మణిరత్నం  ఆస్థాన సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ ఈ చిత్రానికి స్వరకర్త. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఆడియో ఈ నెల 21న విడుదల కానుంది.

వచ్చే నెల ఏడో తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్టు కార్తీక్‌ ట్విట్టర్‌ ద్వారా శుక్రవారం తెలిపారు. ఈనెల హైదరాబాద్‌లో ఈ చిత్రం బృందం ప్రమోషన్‌కు సంబంధించిన కార్యక్రమం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.ఈ చిత్రానికి బర్ఫీ, తమషా మరియు గోలియోన్ కీ రాసలీలా చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన రవివర్మన్ ఈ చిత్రానికి పని చేస్తున్నాడు.

- Advertisement -