15వ ఆర్థిక సంఘం ప్రత్యేక సమావేశం…

228
kcr
- Advertisement -

పదిహేనవ ఆర్థిక సంఘం మూడు రోజుల పాటు తెలంగాణలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 17న రాష్ట్రానికి వచ్చిన ఆర్ధిక సంఘం సభ్యులు తెలంగాణలో ఉన్న ప్రత్యేక పరిస్థితులు,అవసరాలు,ఫైనాన్స్‌ కమిషన్‌ మార్గదర్శకాల తీరుపై సీఎం కేసీఆర్‌తో చర్చించారు. ఈ సందర్భంగా ఆర్థిక సంఘం ఛైర్మన్ ఎస్‌కే సింగ్‌, సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్,ఎంపీలు కేకే,జితేందర్ రెడ్డితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు

19వ తేదీన ఉదయం 10 గంటల నుంచి 1 గంట వర కు ఆర్థికసంఘం సమావేశముంటుందని అధికారులు తెలిపారు. ఈ సమావేశానికి జిల్లా, మండల పరిషత్, మున్సిపాలిటీల చైర్మన్లతోపాటు, పరిశ్రమలు, వివిధశాఖల అధికారులు హాజరుకానున్నారు.

15th finance commission

2020-25 సంవత్సరాలకు సంబంధించి ఎన్ని నిధులు అవసరమనే విషయంపై ఆర్థికశాఖ అధికారులు సమగ్ర నివేదికను తయారుచేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు ప్రత్యేకించి ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన విద్యుత్ బిల్లులు, ఇతర భారాన్ని కేంద్రం భరించాలని ఎస్‌కే సింగ్ నేతృత్వంలోని 15వ ఆర్థికసంఘా న్ని కోరనున్నట్టు తెలిసింది.

జనాభా, పేదరికమే కాకుండా.. అభివృద్ధి, ఆర్థిక క్రమశిక్షణ, పన్నుల రాబడి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకొని నిధులు కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం ఆర్థికసంఘాన్ని కోరనున్నది. నిధుల కేటాయింపు మార్గదర్శకాలను మార్చాలని వాదించనున్నది.

- Advertisement -