నా పేరు సూర్య…అదిరిపోయే రెస్పాన్స్

333
15M views for Naa Peru Surya Naa illu India First Impact
- Advertisement -

వక్కంతం వంశీ దర్శకత్వంలో స్టైలిష్‌ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘నా పేరు సూర్య’ . అర్జున్ సరసన అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమామే 4న ప్రేక్షకుల ముందుకురానుంది. కె. నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్, శ‌ర‌త్ కుమార్ ముఖ్య పాత్రల్లో న‌టిస్తున్నారు.

సినిమాకు సంబంధించిన ఏ చిన్న న్యూసైనా సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. ఇక నాపేరు సూర్య ఫస్ట్ ఇంపాక్ట్‌లో యూ ట్యూబ్‌లో సరికొత్త రికార్డులను బ్రేక్ చేసింది. 15 మిలియన్ వ్యూస్‌తో ఫ్యాన్స్‌ను ఫిదా చేసింది. ముఖ్యంగా అర్జున్ డైలాగ్‌లకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఇక శాటిలైట్స్ రైట్స్‌లోనూ అల్లు వారాబ్బాయి సత్తా చాటాడు. శాటిలైట్, డిజిటల్ రైట్స్ ఏకంగా 15 కోట్ల రూపాయలు పలికినట్లు సమాచారం. జీ తెలుగు ఇంతమొత్తాన్ని వెచ్చించి అర్జున్ మూవీ శాటిలైట్ రైట్స్ సొంతం చేసుకుందట. గతంలో అల్లు అర్జున్ డీజే సినిమా రైట్స్‌ 13 కోట్లకు అమ్ముడుపోగా ఇప్పుడు నా పేరు సూర్య దానికి అదిగమించడం విశేషం. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ….సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని తెలిపారు.

- Advertisement -