- Advertisement -
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 1,549 కరోనా కేసులు నమోదుకాగా 31 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,30,09,390కి చేరగా 4,24,67,774 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.
కరోనాతో ఇప్పటివరకు 5,16,510 మంది మృతిచెందగా ప్రస్తుతం దేశంలో 25,106 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 1,81,24,97,303 మంది టీకాలు పంపిణీ చేశారు.
- Advertisement -