గ్రీన్ ఛాలెంజ్‌…మొక్కలునాటిన గోపి ఆచంట

282
ram achanta
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా యువ హీరో శర్వానంద్ ఇచ్చిన చాలెంజ్ ను స్వీకరించి నేడు శంషాబాద్ లోని వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటారు 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ గోపి ఆచంట.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చాలా చక్కటి కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుక పోతున్నారని.అతనికి మద్దతుగా హిరో శర్వానంద్ నాకు ఇచ్చిన చాలెంజ్ ను స్వీకరించి ఈరోజు మొక్కలు నాటడం జరిగిందన్నారు.

మన భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలంటే మనందరం బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. ఈ సందర్భంగా నేను ప్రముఖ డైరెక్టర్స్ హరీష్ శంకర్, పరశురాం,బి. కిషోర్ లను ఈ చాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

- Advertisement -