- Advertisement -
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో 14 మంది మృతి చెందగా 3,016 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాదాపు ఆరు నెలల తర్వాత ఈ స్థాయిలో కొత్త కేసులు నమోదు కావడం ఇదే మొదటి సారి. ప్రస్తుతం దేశంలో 13,509 కేసులు యాక్టివ్‌గా ఉండగా కరోనా నుండి ఇప్పటివరకు 4,41,68,321 మంది కోలుకున్నారు. దేశంలో ఇప్పటివరకు 5,30,862 మంది మృతిచెందగా గత 24 గంటల్లో మహారాష్ట్రలో ముగ్గురు, ఢిల్లీలో ఇద్దరు, హిమాచల్ ప్రదేశ్‌లో ఒకరు, కేరళలో ఎనిమిది మంది చనిపోయారు.
మొత్తం పాజిటివ్ కేసుల్లో 0.03 శాతం యాక్టివ్‌గా ఉండగా రికవరీ రేటు 98.78 శాతంగా, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 220.65 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఇవి కూడా చదవండి..
- Advertisement -