యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం..

189
- Advertisement -

ఉత్తరప్రదేశ్‌లోని ఎటా జిల్లాలో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మినీ ట్రక్కు బోల్తాపడిన ఘటనలో 14 మంది వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 24 మందికి గాయాలయ్యాయి. ఆగ్రా నుంచి ఇటా ప్రాంతం వైపు పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రక్కు సరాయ్‌ నీమ్‌ వద్దకు రాగానే అదుపు తప్పి కాలువలో పడిపోయింది. స్థానికులు సమాచారంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆగ్రా మెడికల్‌ కాలేజ్‌ హాస్పిటల్‌కి తరలించారు. ట్రక్కు బోల్తా పడడంతో వాహనం కింద చాలా మంది చిక్కుకుపోయారని.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు. ట్రక్కు డ్రైవర్‌ నిద్రపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగినట్లు వెల్లడించారు.

truck

- Advertisement -