జర్నలిస్టు కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

6
- Advertisement -

జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకు14 రోజుల రిమాండ్‌ విధించింది న్యాయస్థానం. గుంటూరు జిల్లాలోని మంగళగిరి కోర్టులో ఇవాళ విచారణ జరుగగా 14 రోజుల రిమాండ్ విధించగా ఆయన్ని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.

ఏపీ రాజధాని అమరావతిని కించపరిచారని రాష్ట్ర మాదిగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కంభంపాటి శిరీష ఫిర్యాదు మేరకు తుళ్లూరు పోలీస్‌ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైంది.

ఓ టీవీ ఛానల్‌లో నిర్వహించిన చర్చ సందర్భంగా అమరావతి రాజధానిపై జర్నలిస్టు కృష్ణంరాజు అసభ్య వ్యాఖ్యలు చేశారు. అమరావతి వేశ్యల రాజధాని అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలతో ఏపీవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. ఈ క్రమంలో రాజధాని రైతులు, మహిళలు, ఏపీ రాష్ట్ర మాదిగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కంభంపాటి శిరీష ఫిర్యాదు మేరకు ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు.

Also Read:రాహుల్‌తో రేవంత్ భేటీ..

- Advertisement -