అచ్చెన్నాయుడికి 14 రోజుల రిమాండ్…

275
achennayudu
- Advertisement -

ఏపీ ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ (ఐఎంఎస్‌) స్కాంలో దాదాపు రూ.150 కోట్ల మేర అవినీతి జరిగినట్టు గుర్తించిన ఏపీ ఏసీబీ మాజీ కార్మికమంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో అచ్చెన్నాయుడికి ఏసీబీ న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించారు. అయితే అనారోగ్య కారణాల దృష్ట్యా ఆయనను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో అచ్చెన్నాయుడును తొలుత విజయవాడ‌ జైలుకు తరలించారు.

ఇక ఇదే కేసులో ఏ1గా ఉన్న ఈఎస్‌ఐ మాజీ డైరెక్టర్‌ రమేశ్‌కుమార్‌కు‌ కూడా రెండు వారాల రిమాండ్‌ విధిస్తూ ఏసీబీ న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు. దీంతో అధికారులు రమేష్‌కుమార్‌ను అధికారులు రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించారు.

- Advertisement -