ఏపీలో కొత్తగా 1,316 మందికి కరోనా పాజిటివ్..

31
Corona cases

ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 75,165 మంది శాంపిల్స్ ని పరీక్షించగా 1,316 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 8,58,711కి పెరిగింది. కరోనా చికిత్స పొందుతూ గత 24 గంటల్లో 11 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 6,910కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 16,000 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గత 24 గంటల్లో 1,821 మంది కరోనా నుంచి కోలుకున్నారు.