- Advertisement -
అశ్వీనిదత్ వైజయంతి బ్యానర్‌లో హను రాఘవపూడి తెరకెక్కించిన అందమైన ప్రేమకావ్యం సీతారామం. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది.
ఈ సందర్భంగా అశ్వినీదత్ మాట్లాడుతూ….పెళ్లి సందడి సినిమాను హిందీలో తీశాం. అది బాగానే ఆడింది. ఆ తర్వాత నేను, అరవింద్ కలిసి అనిల్ కపూర్‌తో చూడాలని ఉంది సినిమా హిందీలో రీమేక్ చేశాం. ఆ సినిమా వల్ల మా ఇద్దరికీ చెరో ఆరు కోట్లు అంటే మొత్తం 12 కోట్లు నష్టపోయాం. దాని నుంచి తేరుకోవడానికి చాలానే సమయం పట్టిందన్నారు.
ఇక సినిమాలు ఆపేయాలి అనుకుంటే నా చివరి సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 అవ్వాలనుకుంటున్నాను అని తెలిపారు. దీంతో ఈ సినిమాపై మరింత ఆసక్తినెలకొంది.
- Advertisement -