- Advertisement -
శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుండగా 18 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 79,525 మంది భక్తులు దర్శించుకోగా 39,545 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండికి రికార్డు స్ధాయిలో ఆదాయం వచ్చింది.
8 నుంచి 10వ తేదీ వరకు పవిత్రోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇవాళ అంకురార్పణంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. ఆగస్టు 9న అష్టదళ పాదపద్మారాధనతోపాటు ఆగస్టు 8 నుంచి 10వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేశారు.
- Advertisement -