మార్చి నెలలో 12 రోజులు బ్యాంకులకు హాలీడేస్ ఉండనున్నాయి. హోలీ సహా ఉగాది, శ్రీరామనవమితో పాటు పలు పండుగలు ఉన్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్చిలో బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది. వీక్లీ ఆఫ్‌లు, సాధారణ సెలవు రోజులతో సహా మొత్తం ఈ నెలలో 12రోజులు పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో నాలుగు ఆదివారాలు, రెండు శనివారాలతో పాటు మూడు ప్రధాన పండుగల సమయంలో బ్యాంకులు మూతపడనున్నాయి.
()మార్చి 5, 12, 19, 26 తేదీల్లో ఆదివారం కావడంతో ఈ నాలుగు రోజులు బ్యాంకులకు సెలవులు.
() మార్చి 11, 25 తేదీల్లో రెండవ, నాల్గో శనివారాలు కావడంతో బ్యాంకులు మూసి ఉంటాయి.
() మార్చి 3(శుక్రవారం) – చుప్‌చార్ కుట్ (త్రిపుర రాజధాని అగర్తలలో సెలవు)
() మార్చి 7 (మంగళవారం)- హోలీ (తెలుగు రాష్ట్రాల్లో సెలవు)
() మార్చి 8 ( బుధవారం) – హోలీ సందర్భంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో సెలవులు
() మార్చి 9 (గురువారం) – హోలీ పాట్నా
() మార్చి 22 (బుధవారం) – ఉగాది పర్వదినం ( తెలుగు రాష్ట్రాల్లో సెలవు)
() మార్చి 30 ( గురువారం) శ్రీరామనవమి (తెలుగు రాష్ట్రాల్లోసెలవు)
ఇవి కూడా చదవండి..