రైతుబంధు సంపూర్ణం..

47
- Advertisement -

11వ విడత రైతు బంధు సంపూర్ణమైంది. 11వ విడతలో రూ.7624.74 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. 68.99 లక్షల మంది రైతులకు చెందిన 1.52 కోట్ల ఎకరాలకు పంపిణీ చేశామని…అత్యధికం నల్లగొండ జిల్లాలో 5 లక్షల 8756 మంది రైతులకు రూ.609.67 కోట్లు జమ చేశామన్నారు.

అత్యల్పం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 35,879 మంది రైతులకు రూ.33.60 కోట్లు జమ అయ్యాయని తెలిపారు. తెలంగాణలో రైతును రాజును చేయాలన్న సంకల్పంతో కేసీఆర్ ముందుకు సాగుతున్నారని…ఎన్ని ఇబ్బందులున్న ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ పూర్తిచేస్తున్నాం అన్నారు. రైతుబంధు మొదలుపెట్టినప్పుడు ఎన్నికల కోసం అని విమర్శించారు… మొత్తం ఇప్పటి వరకు రూ.72,815.09 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమచేశామన్నారు.

స్వతంత్య్ర భారత చరిత్రలో ఇది ఒక రికార్డు అని…అన్నదాతల గుండెల్లో కేసీఆర్ చిరస్థాయిగా నిలుస్తారన్నారు. అన్నం పెట్టే అన్నదాతకు ఆసరాగా నిలవాలన్నదే కేసీఆర్ తపన అని…దేశంలో ఉచిత కరంటు, సాగునీళ్లు, రైతుబంధు, రైతుభీమా పథకాలతో పాటు వంద శాతం పంటలు కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఈ సందర్భంగా రైతుల పక్షాన సీఎం కేసీఆర్‌కి ధన్యవాదాలు తెలిపారు నిరంజన్ రెడ్డి.

Also Read:KCR:సంక్షేమంలో తెలంగాణ నెంబర్ 1

- Advertisement -