రాష్ట్రంలో మూడో రోజు రైతు బంధు పంపిణీ కొనసాగుతోంది. మూడో రోజు రైతుబంధు రూ.1325.24 కోట్లు పంపిణీ చేశామని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. 10.89 లక్షల రైతుల ఖాతాలలో డబ్బు జమ అయిందని తెలిపారు. ఇప్పటి వరకు 50.43 లక్షల మంది రైతుల ఖాతాలలో రూ.3246.42 కోట్లు జమ చేశామన్నారు.
రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలో పథకాల అమలు చేస్తున్నామని వెల్లడించారు నిరంజన్ రెడ్డి. వ్యవసాయం, రైతు బాగుంటేనే సమాజం బాగుంటుందని..అందుకే జనాభాలో అధికశాతం ఆధారపడిన వ్యవసాయరంగం బలోపేతానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేయూతనిస్తున్నారని తెలిపారు.
Also Read:కీళ్ల నొప్పులు తగ్గడానికి చిట్కాలు…
ఈ సీజన్‌లో 1.54 కోట్ల ఎకరాలకుగానూ 70 లక్షల మంది రైతులకు ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించనుంది. గతంతో పోల్చితే ఈ సీజన్‌లో 5 లక్షల మంది రైతులకు కొత్తగా రైతుబంధు అందిస్తున్నది. రైతులు, భూ విస్తీర్ణం పెరగడంతో ఈ సీజన్‌లో రైతుబంధు కోసం రూ.7,720.29 కోట్లు ఖర్చు చేయనుంది. 1.5 లక్షల మంది పోడు రైతులకు చెందిన 4 లక్షల ఎకరాలకు కూడా రైతుబంధు సాయం అందించనున్నారు.
Also Read:‘తొలంగులాసనం’తో ఆ సమస్య దూరం..!